22, ఏప్రిల్ 2021, గురువారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 14 రంపచోడవరం (తూ.గో.జిల్లా)

   జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 14  రంపచోడవరం  (తూ.గో.జిల్లా) 

మేము పిల్లలతో చేసిన విహార యాత్రలలో రంప చోడవరం,  మారేడుమిల్లి అద్భుతమైన ప్రయాణాలు.



మా తాతగారి వూరు, మా అమ్మ పుట్టిల్లు అయిన తర్వాత ...

మేము 18.1.2013న ఉదయం ఆరుగంటలకి రాజమండ్రిలో ఉన్న మా మామయ్య కొడుకు ఇంటి నుంచి కారులో రంపచోడవరం  బయల్దేరాం.  

ఎక్కడ చూసినా పచ్చదనమే. కళ్ళకి చాలా ఆహ్లాదంగా వుంది. చల్లటి గాలి. కొంత దూరం వెళ్ళాక ఒక పాక హోటల్ లో వేడి వేడి ఇడ్లీ తిన్నాం. ఆ చల్లటి గాలి, వేడి వేడి ఇడ్లీ చాలా బాగా అనిపించింది. ప్రయాణంలో నూనెవి తింటే కష్టమని ఇడ్లీకి ప్రిఫరెన్స్ ఇచ్చాం.

మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. సన్న సన్నటి దారులు బారులు తీరిన చెట్లతో చక్కగా వున్నాయి. అలా కొంత దూరం వెళ్ళాక  అక్కడ చిన్నపాటి జలపాతాలు చాలా ఉన్నాయి. ముందరే మా అబ్బాయికి నీళ్ళంటే పిచ్చి. ఇక పిల్లలిద్దరూ చాలాసేపు నీళ్ళలో ఆడారు.

చెట్ల మీదకి పాకిన లతల మొదళ్ళు చాలా బలంగా ఉయ్యాలలా ఉన్నాయి. చుట్టూరా పెద్ద పెద్ద చెట్లతో దట్టమైన అడవుల్లా వున్నాయి. అక్కడ చాలా సేపు గడిపాము.  అక్కడ పిల్లలు బాగా గడిపారు.





























9 కామెంట్‌లు:

  1. రంపచోడవరం.తూ.గో.జిల్లా అండీ ప.గో.జిల్లా కాదు.

    రిప్లయితొలగించండి
  2. క్షమించండి. పొరపాటు జరిగింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రమాదో‌ ధీమతా మపి అన్నారు. చిన్న పొరపాటు, అంతే. మరి మీరు టపా శీర్షికను ఇంకా పూర్తిగా మార్చలేదు. మరొకసారి సరిజూడగలరు. అన్నట్లు 50సం. క్రిందట మూడేళ్ళు మేము రంపచోడవరంలో ఉన్నాం. అక్కడి హైస్కూలుకు మానాన్నగారు కీ.శే. తాడిగడప వేంకట సత్యనారాయణ గారు హడాష్టరుగా ఉండేవారు. అక్కడ ఉన్నరోజుల్లోనే నాకు హైదరాబాదులో ఉద్యోగం రావటం నేను వలస రావటం‌ జరిగింది. అప్పట్లో మేము స్కూలు గ్రౌండులో ఉన్న క్వార్టర్స్‌లో ఉండేవారం - దానికి అప్పటికి కరెంటు సౌకర్యం కూడా లేదు!

      తొలగించండి
    2. అన్నట్లు మీరు రంపకొండ ఎక్కారా? అక్కడి జలపాతాన్ని చూసారా? చాలా బాగుంటుంది. రంపచోడవరం‌ పోలీస్ స్టేషన్‌లో అల్లూరి సంతకం ఉన్న ఉత్తరం కూడా ఉంది! ఇంకా అది ఉంచారనే‌ భావిద్దాం.

      తొలగించండి
  3. ఒకచోట కరక్ట్ చేశాను. మిగిలినది కూడా కరక్ట్ చేస్తానండీ.
    మీ జ్ఞాపకాలు బాగున్నాయి. మాకు అప్పుడు సరైన గైడెన్స్ లేదు. చాలా బావుంటుంది అని మా మామయ్య కొడుకు కారులో పంపించాడు. కొండమీద జలపాతం చాలా బావుంటుందని చెప్పారు కానీ మేము ఎక్కలేదండీ. అల్లూరి ఉత్తరం కూడా చూడలేదు. మిస్సయిపోయాం. దీని తర్వాత మారేడుమిల్లి వెళ్ళాం. అక్కడ కూడా చాలా బావుంది. అవకాశం వుంటే మరెప్పుడైనా మీరు చెప్పినవి చూడాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకు రంపచోడవరం జీవితం టినేజీదశ చివరిరోజులలో నడిచింది. మంచి జ్ఞాపకాలున్నాయి. నేనేమీ ఆత్మకథ వ్రాసుకొనేంత గొప్పవాడిని కాను కానీ, వ్రస్తే మాత్రం ఆకాలమే ఒక మంచి అధ్యాయం అవుతుంది. రంపకొండ ఎక్కటం చాలా తేలిక చిన్నపిల్లలూ సునాయాసంగా ఎకేస్తారు. వాలు బాగుండటమే‌ కారణం. మారేడుమిల్లి నేను చూడలేదు కాని అక్కడ నాలుగింటికే రాత్రి ఐపోతుందంటారు అప్పట్లో అంతదట్టమైన అటవి అది. ఇప్పుడెలా ఉందో‌ మరి. ఒకసారి మారేడుమిల్లి హెడ్మాష్టరుగారి ఇంట్లో శుభకార్యానికి మాఅమ్మగారు వెళ్ళారు. బస్సులో అన్నమాట. హఠాత్తుగా డ్రైవరు బస్సు ఆపి నిశ్శబ్దం అని సంజ్ఞ చేసాడట. మరి బస్సు ఎదురుగా రోడ్డుకు అడ్డంగా పెద్దపులి విశ్రాంతి తీసుకుంటున్నది మరి. అంతా నిశ్శబ్దంగా వేచి ఉన్నారు. కొన్ని గంటలు - రెండో మూడో మరి - గడిచాక ఆవ్యాఘ్రరాజేంద్రుల వారు లేచి అటవిలోపలికి దయచేసారు. అప్పుడు కదిలిందట బస్సు. అప్పటికే నేను హైదరాబాదు వచ్చేసాను. మధ్యలో ఇంటికి వచ్చినప్పుడు ఈఉదంతం మాఅమ్మగారు చెప్పారు.

      తొలగించండి
  4. అవునాండీ బలేవుంది సంఘటన.
    "నేనేమీ ఆత్మకథ వ్రాసుకొనేంత గొప్పవాడిని కాను కానీ, వ్రస్తే మాత్రం ఆకాలమే ఒక మంచి అధ్యాయం అవుతుంది" - అన్నారు మీరు.

    గొప్పవాళ్ళం అవక్కరలేదు. మన చిన్నప్పటి జ్ఞాపకాలు మనకెప్పుడూ మంచి అనుభూతిని ఇస్తాయి. మనకోసం మనం రాసుకోవచ్చు. మనం తిరిగినచోట్లు, మన ఆటలు మన పిల్లలకి కుదరకపోవచ్చు. మాది తాడేపల్లిగూడెం. మా చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అవన్నీ చాలా ఫేస్ బుక్ లో చాలా పెట్టాను.

    మారేడుమిల్లి మేము 2013లో వెళ్లాము. చాలా బావుంది. నిజంగానే దట్టమైన అడవులు. మేము మధ్యాహ్నం 12 గంటలకి వెళ్ళాం. వాళ్ళు 4 తరవాత ఉండనివ్వమని చెప్పారు. చీకటి పడడం కాదు కానీ జంతువులు అప్పడు బయటికి వస్తాయిట.

    మీ జ్ఞాపకాలు రాయండి. చదవాలని వుంది.

    రిప్లయితొలగించండి