25, మార్చి 2023, శనివారం

స్వీట్ కార్న్ సలాడ్ చేస్తుంటే ఇలా..... 77

స్వీట్ కార్న్ సలాడ్ చేస్తుంటే ఇలా..... 77



నా జీవనయానంలో ఫుడ్ స్టాల్ పెట్టాలన్న కోరిక తీరలేదు.
నేను 1986లో అనుకున్నాను.
నాకు సలాడ్స్, ఛాట్ స్టాల్ ఎప్పుడైనా సరదాపెట్టాలనుకున్నాను.
ఈమాట చెప్తే కొంతమంది పెట్టండి మేమే ముందర వస్తాం తినడానికి అన్నారు.
మేమూ వెనకే వస్తాం అన్నారు.


నాకు బయట రకరకాల ఫుడ్స్ తిన్నప్పుడు
ఇప్పటికీ నెలకి ఒకరోజు ఇంటి భోజనం అని ఒక స్టాల్ పెట్టాలనిపిస్తుంది.

***
***
ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ రోజూ ఉద్యోగం చేసుకునే వాళ్ళు
శుక్రవారం, శనివారం, ఆదివారం స్టాల్స్ పెట్టుకుంటారు.
రకరకాల ఫుడ్స్ ఎంజాయ్ చెయ్యాలనుకునేవాళ్ళు
అక్కడి వెళ్ళి అవి తింటూ చాలాసేపు గడుపుతారు.




ఆదివారం సంత వుంటుంది.
అక్కడయితే కూరగాయలు, పళ్ళు, ఫుడ్ కి సంబంధించిన రకరకాలన్నీ అమ్ముతారు.

కొండమీద చెట్ల నీడలో, చల్లటి గాలిలో పోద్దున్న నుంచీ మధ్యాహ్నం వరకూ మాత్రమే వుంటుంది.
అక్కడ తిరుగుతుంటే బలే సరదాగా వుంటుంది.

3 కామెంట్‌లు:

  1. పైన మొదటి ఫొటోలోని సలాడ్ మంచి రంగురంగులుగా ఉందే 🙂.
    అవును, ఇంతకీ స్టాల్ పెట్టాలి అంటే ఎక్కడ పెడదామని మీ ఆలోచన?

    రిప్లయితొలగించండి