4, మే 2021, మంగళవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 16 - ఆత్రేయపురం పూతరేకులు

 

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు 16  - ఆత్రేయపురం పూతరేకులు.

 

పిల్లలతో విహారయాత్రలో ఆత్రేయపురం చెప్పుకోదగ్గది.





 

మామయ్య కొడుకు శేఖర్ ఆత్రేయపురం, అంతర్వేది ఒకసారి కవర్ చేసుకురండి అన్నాడు.  ఆరోజు ఉదయం 7 గంటలకల్లా బయల్దేరాం.  దారంతా స్వాగతమిస్తున్న పచ్చటి చెట్లు, కాలవలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. మా పిల్లలు అసలు ఆంధ్రవైపు పల్లెటూళ్లు  చూడలేదేమో వాళ్ళకి ఒకటే సంతోషం.

 

ఒక చిన్న పల్లెటూరు దగ్గర ఆగాం. అక్కడ పొలాలు గడ్డిమేట్లు చూడగానే వాళ్ళకి ఆనందం చిందులు వేసింది. అసలు వాళ్ళు అంత దగ్గిరనుంచి పొలాలు చూడలేదు. గడ్డిమేటు ఫోటోలలో చూశారేమో కాని నిజంగా చూడడం మొట్టమొదటిసారి.  కాసేపు ఆనందంగా అక్కడ గడిపారు.

 

శేఖర్ మీరు ఆత్రేయపురం వెళ్ళేటప్పుడు దారిలో ఆత్రేయపురం రాజుగారి  టిఫిన్ సెంటర్ వస్తుంది. అక్కడ మీరు తప్పకుండా టిఫిన్ చెయ్యాల్సిందే. ప్రతి టిఫిను రుచి చూడండి. సినిమా వాళ్ళందరూ ఈ టిఫిన్ కోసం ఒక ట్రిప్ వేసుకుని తినేసి వెళ్తారు అని చెప్పాడు. టిఫిన్ సెంటర్ కి వెళ్ళాం. చాలా రష్ గా వుంది.  కానీ వాళ్ళు ఎవరినీ నిరాశపరచకుండా అందరికీ అడిగినవన్నీ అందిస్తున్నారు. అది చాలా ఆశ్చర్యం వేసింది.  ఒక ఐదారు రకాల టిఫిన్ లు రుచి చూశాం.  పెసరట్టు చాలా ఫేమస్. నిజంగానే చాలా బావుంది.

 

అదయిన తర్వాత ఆత్రేయపురంలో తిరుగుతుంటే ప్రతి ఇంట్లోను పూతరేకులు చేస్తున్నారు. మామితాండ్ర బయట పెట్టి అమ్ముతున్నారు.

 

భక్తాంజనేయ పూతరేకులు అని బోర్డున్న ఒక ఇంటి దగ్గర ఆగాం.  ఒక అమ్మాయి మమ్మల్ని కూచోపెట్టి   అప్పటికప్పుడు పూతరేకులు చేసి ఇచ్చింది.  మా అబ్బాయి పూతరేకులు చెయ్యడంలో ఆ అమ్మాయికి సాయం చేశాడు. ఒక రెండువందలు డ్రైఫూట్ పూతరేకులు తీసుకున్నాం.  వాటిని వాళ్ళు చక్కగా అట్టపెట్టెలో పెట్టి నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు.

 

ఇల్లు చిన్నదే అయినా చుట్టూరా చెట్లతో చల్లగా వుంది. వెనకవైపు కొంచెం దిగువగా ప్రశాంతంగా ప్రవహిస్తున్న కాలవ వుంది.  ఆ వాతావరణం చాలా బావుంది.

 

వాళ్ళిచ్చిన పూతరేకులు తీసుకుని  అంతర్వేది బయల్దేరాం.

































 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి