7, ఫిబ్రవరి 2021, ఆదివారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 5

 మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 5






మర్నాడు పొద్దున్న మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాను. పాప పడుకుని నిద్రపోతూనే వుంది. చాలా చక్కగా వుంది.  వాళ్ళు నాకు లంచ్ వాళ్ళు రైస్, పప్పు, మిక్స్ డ్ వెజిటబుల్ చట్నీ, ఐస్ క్రీం, పళ్ళ ముక్కలు, వెజిటబుల్ కట్ లెట్ ఇచ్చారు. అన్నీ బావున్నాయి. 

పాపని కాసేపు ఎత్తుకుని పాలు పట్టాను. ఎందుకో ఒక రెండు రోజులు అలా పట్టమన్నారు. సాయంత్రం శేఖర్ నన్ను ఇంటి దగ్గర దింపుతానని చెప్పాడు. అక్కడ ఒక చోట శేఖర్ వచ్చే వరకూ వెయిట్ చేశాను. 

అనుకోకుండా కళ్ళపడిన దృశ్యం. ఇవన్నీ ఎందుకు రాస్తున్నాననుకుంటున్నారా.... మధ్యలో ఏం జరిగిందో తెలియాలి కదా....

చిన్న ప్రదేశం....
ఎంత అందమో....
చిన్న కొలను, కొలను పక్కన చిన్నకొండ
కొండమీదకు వంగి వూసులాడుతున్న చెట్లు
చెట్ల చాటునుంచి రంగులీనుతున్న సూర్య కిరణాలు
ఆ కిరణాలతో చెరువులో అందంగా ఏర్పడిన ఇంద్రధనుసు
ఆ కిరణాల మధ్య ఈదులాడుతున్న చేపలు
నీటిలో తమ నీడల అందాలు చూస్తూ మురిసిపోతున్న చెట్లు
అక్కడే ఉండాలనిపించేంత అందం. ఇది ఎక్కడో వూరవతల కాదు.
సిటీ మధ్యలో ఒక హాస్పిటల్ పక్కనే వుంది ఈ అందమైన దృశ్యం

దీన్ని వెంటనే ఫోనులో బంధించేసి శేఖర్ తో కలిసి ఇంటికి వచ్చేశాను. రాత్రి ఎవరింటికీ వెళ్ళను ఒక్కదాన్నే వుంటాను. ఫర్వాలేదు అని చెప్పాను. నన్ను దింపేసి వెళ్ళిపోయాడు.

కొంచెం భయం వేసింది అంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్నీ వుంటాలంటే... పైగా చివరి బెడ్ రూం. ఫ్రెంట్ డోర్ కి నేను పడుకున్న బెడ్రూంకి చాలా దూరం. ముందర ఏమవుతుందో వెనక ఉన్నవాళ్ళకి తెలియదు. సరే అన్ని డోర్ లు లాక్ వేసుకుని డిన్నర్ చేసి రూంలోకి వెళ్ళి ఇండియాలో మా వాళ్ళతో కాసేపు ఫోన్ మాట్లాడాను. మొత్తానికి రాత్రి పదకొండున్నరకి ఎలాగో నిద్ర పట్టేసింది.



2 కామెంట్‌లు:

  1. ఎంతో ముచ్చటగా ఉన్నాయండి మీ మనవరాలి ముచ్చట్లు. 2008, జూలై లో మూడు నెలల పాటు శెలవు పెట్టి ఇలాగే మా అమ్మాయి డెలివరీ కోసం అమెరికా వెళ్ళాను. డెలివరీ తర్వాత ఒక రాత్రంతా ఇంట్లో బిక్కు బిక్కు మంటూ అచ్చం మీలాగే గడిపాను. మీ పోస్ట్ చదువుతుంటే ఆ రోజులు గుర్తొచ్చాయి. నా మనవడికి ఇప్పుడు పదమూడవ ఏడు నడుస్తోంది. ఆ జ్ఞాపకాలు తట్టిలేపారు. Thank you.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా సంతోషమండీ. ఇలా చదివి మీ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నందుకు. ఎన్నుంటాయో కదా.

      తొలగించండి