5, ఏప్రిల్ 2021, సోమవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 11 మా తాతగారి వూరు పెనుగొండ (పగో.జిల్లా) లో ఇల్లు




 

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 11    మా తాతగారి వూరు పెనుగొండ (పగో.జిల్లా) లో ఇల్లు

ఇంతవరకు మా తాతగారి ఊరు గురించి చెప్పాను. కానీ ఆ ఇల్లు ఎలా వుండేదో ఇప్పుడు చూడండి.

ఇంటి ముందు ఎత్తైన గోడ, వీధి గుమ్మం వుండేవి. ఆ గోడ మీద గిన్నె మాలతీ పువ్వుల తీగ సుగంధాలు వెదజల్లుతూ వుండేది.  తరవాత తరవాత అది ఏమైందో తెలియదు. మేము పెద్దయ్యేసరికి కనిపించలేదు.

లోపలికి వెడితే ఇంటి గుమ్మం మెట్లకి అటూ ఇటూ ఏనుగుల బొమ్మలు వుండేవి. ఆ తరవాత అరుగు, అక్కడి నుంచి లోపలికి వెళ్ళే గుమ్మం. అరుగుకి కుడివైపున ఒక గుమ్మం వుండి ఒక గది వుండేది.

ముందుగా ఒక హాలు వుండేది. ఆ హాలులో అటూ ఇటూ అమ్మమ్మ తాతయ్య మడత మంచాలు వేసుకుని కిటికీలో టేబుల్ ఫేన్ పెట్టుకుని పడుకునేవారు. హాలుకి ఎడమవైపున ఒక పడక గది వుండేది.  

తర్వాత ఒక గదిలో ఎడమవైపు దేవుడి మందిరం పక్కనే కొద్ది దూరంలో మజ్జిగ చిలకడానికి పెద్ద కుండ, కవ్వం.  కాంతమ్మ అని ఒక పని అమ్మాయి వుండేది. రోజూ వచ్చి ఇంట్లో మజ్జిగ చేసేది. కాలవ నించి మంచినీళ్ళు తీసుకొచ్చి పోసేది. ఈ దేవుడి మందిరం అంతా రకరకాల పువ్వులతో కళకళలాడుతూ వుండేది. అమ్మమ్మ గొంతెత్తి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, కౌసల్యా సుప్రజారామా... అంటూ సుప్రభాతం అన్నీ చదువుతుండేది. ఆ గొంతు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ వుంటుంది.  ఈ రూములోనే ఒక చెక్కతో చేసిన ర్యాక్ మీద కరెంటు స్టౌ వుండేది. దాని మీద కాఫీ కలుపుతూ వుండేవారు.

ఈ గదికి ఎడమవైపున వంట గది వుండేది. అక్కడ మట్టి పొయ్యి వుండేది. ఆ పొయ్యిమీద వంట చేసేవారు.  రోజూ కాంతమ్మ మధ్యాహ్నం వచ్చి ఆ పొయ్యి శుభ్రం చేసి పేడతో అలికి వెళ్ళేది.

దేముడి గదికి ఎడమవైపున ఒక గది వుండేది. ఆ గదిలో మంచినీళ్ళ బిందెలు పెట్టేవారు.  అక్కడి నుంచి కిందకి దిగితే ఒక వరండా.... మెట్లకి కొంచెం ఎదురుగా ఒక మట్టి పొయ్యి. ఆ మట్టి పొయ్యి మీద సాయంత్రం అప్పుడు వంట చేసేవారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి