10, నవంబర్ 2020, మంగళవారం

అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన ఉత్తరాలు 8


 అమ్మా... చాలా రోజులైంది కదా...

నీతో నేను వీడియో ఛాట్ చేసి కూడా చాలా రోజులైంది. ఈమధ్య ఆఫీస్ లో పని ఎక్కువైంది. శనివారం, ఆదివారం కూడా వెళ్తున్నాను.

నిన్న మా ఫ్రెండ్ నేను కలిసి లంచ్ టైంలో ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళాం. అక్కడ మజ్జిగ తీసుకున్నాం. చాలా బాగుంది. నాకు ఎందుకో సడన్ గా నా చిన్నప్పటి విషయం గుర్తుకు వచ్చింది. అమ్మా... నువ్వు చెప్పిన విషయమే.

నాకు సంవత్సరం అప్పుడు విజయవాడ పెద్దమ్మా వాళ్ళింటికి వెళ్ళామని, వాళ్ళింట్లో నువ్వు నాకు అన్నం కలిపి పెడుతుంటే అన్నీ పేచీ పెట్టకుండా తిన్నానని పెద్దమ్మ కూడా బాగా మెచ్చుకుందని చెప్పావు. కానీ, చివరలో నాకు పెరుగు వెయ్యకుండా మజ్జిగ పోస్తే - నేను పెరుగే కావాలని పేచీ పెట్టానని నువ్వేమో ఏం చెయ్యాలో తెలియక - నా పేచీ చూసి విజయవాడలో ఎండలు కదా... పెరుగు కరిగిపోయిందని చెప్పానన్నావు. నేను చిన్నపిల్లని కదా... పేచీ ఆపి తినేశాను కదా...

పెద్దమ్మ మాత్రం చాలా బాధపడి మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వరకు రోజూ నాకు పెరుకు వేసి పెట్టిందని చెప్పావు. చిన్నప్పుడు పేచీలు బలేవుంటాయి కదమ్మా...

చిన్నుగాడు మాత్రం చాలా పేచీలు పెట్టేవాడు కదా...

ఇద్దరం అన్నీ గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంటూ వుంటాం. అమ్మా ఇవన్నీ ఒక పుస్తకం వేద్దాం. మేము అప్పుడప్పుడు చదువుకోవచ్చు.

1 కామెంట్‌:

  1. లేఖాసాహిత్యం లుప్తప్రక్రియ ఐపోయిందని విచారం ఇంకా అక్కర్లేదు. ఉత్తరాలు తప్పక పుస్తకంగా చేయండి. బాగుంటుంది. ఈరోజున సెల్ ఫోన్ అందరిచేతుల్లోనూ ఉండబట్టి ఉత్తరం మాయం ఐపోయింది.

    రిప్లయితొలగించండి