29, మే 2021, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 17 - పట్టెసీమ, కడియపు లంకల ప్రయాణం కూడా ఒక అందమైన జ్ఞాపకమే

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 17  - పట్టెసీమ, కడియపు లంకల ప్రయాణం కూడా ఒక అందమైన జ్ఞాపకమే

కొవ్వూరుకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టెసీమకి, 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడియపు లంకకి వెళ్ళడంతో మా పిల్లలతో విహారయాత్ర పూర్తయింది. అది ఒక అందమైన జ్ఞాపకంగా వుండిపోయింది. 

 

పట్టెసీమ గుడి గోదావరి మధ్యలో చిన్న లంకలో వుంటుంది కాబట్టి బోటులో కొంత దూరం వెళ్ళి అక్కడ నుంచి ఇసుకలో నడిచి వెళ్ళాల్సి వచ్చింది.  వర్షాకాలంలో గుడి వరకు కూడా నీళ్ళుంటాయిట. అలా బోటులో వెళ్ళి గుడికి వెళ్ళేటైముకి అప్పుడే మూసేస్తున్నారు. హడావుడిగా దర్శనం చేసుకునికాసేపు అక్కడ కూచుని  చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాము. మొత్తానికి ఎప్పటి నుంచో చూడాలనుకున్న పట్టెసీమకి వెళ్ళాం. 

 

(పట్టిసంపశ్చిమ గోదావరి జిల్లాపోలవరం మండలానికి చెందిన గ్రామం. ప్రసిద్ధ శైవ క్షేత్రము. చారిత్రకంగానూఆధ్యాత్మికంగానూ విశేషమైన స్థానం కలదీ పట్టిసం. పాపికొండల మధ్య సాగే గోదావరి ఒడ్డున దేవకూట పర్వతంపైన వీరభద్రస్వామి వారి ఆలయంభావనారాయణ స్వామివార్ల ఆలయాలు ఉన్నాయి. దీనిని పట్టిసీమ అని కూడా పిలుస్తుంటారు.  గోదావరి మధ్య చిన్న లంక లాగా ఉన్న ప్రదేశంలో శ్రీ వీరభధ్రస్వామి దేవస్థానం ప్రకృతితో సుందరంగా ఉంటుంది.   దీనికి పౌరాణికంగా కథ కూడా వుంది .

 

దక్ష ప్రజాపతి తను చేస్తున్న యజ్ఞానికి అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండా అవమాన పరుస్తాడు. ఆ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవితిరిగి శివుడి దగ్గరికి వెళ్లలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది. దాంతో ఉగ్రుడైన రుద్రుడు . వీరభద్రుడిని సృష్టించిదక్షుడి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞ వాటికపై వీరభద్రుడు విరుచుకుపడతాడు. తన ఆయుధమైన 'పట్టసం' ( పొడవైన వంకీ కత్తి ) తో దక్షుడి తల నరికి దానిని గోదావరిలో కడిగాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టసమనీపట్టిసీమనీపట్టసాచల క్షేత్రమని పిలుస్తుంటారు.) 

 

అక్కడ నుంచి బయల్దేరి రాజమండ్రి వెళ్ళి అక్కడ ఒక హోటల్ లో భోజనం చేశాం. చాలా రద్దీగా వుంది. మధ్యాహ్నం అలిసిపోయిఆకలితో వుండి తిన్నాం. భోజనం బాగానే వుంది. ఆ రద్దీ చూస్తే కొంచెం విసుగనిపించింది. 

 

రాజమండ్రి నుంచి 21 నిమిషాలు దూరంలో వున్న కడియపు లంకకి వెళ్ళాం. అక్కడ పల్ల వెంకన్న నర్సరీ చాలా ఫేమస్. అక్కడ లేని మొక్కంటూ వుండదని చెప్తారు. అక్కడ ఒక్క నర్సరీ చూడాలంటేనే చాలా టైం పడుతుంది. మేము ఈ నర్సరీ తిరిగేసరికి సాయంకాలం అయిపోయింది. 

 

ఇక్కడ కూడా పిల్లలు చాలా బాగా గడిపారు. మొత్తానికి పిల్లలతో మా ప్రయాణం చాలా బాగా జరిగింది. 






















































 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి