28, ఆగస్టు 2021, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 27 - నాన్నగారి వూరు ఏలూరు వివరాలు -3

 

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 27 - నాన్నగారి వూరు ఏలూరు వివరాలు -3



బామ్మ మా నాన్నగారిని బాగా గారబంగా పెంచింది. ఆడింది ఆట పాడింది పాటగా వుండేది. బాగా అల్లరి చేస్తుండేవారుట. ఒకసారి బామ్మ తిట్టిందని ఒక అగ్గిపెట్టె, చిన్న కిరసనాయిలు దీపం పట్టుకుని రైల్వేట్రాక్ మీద నడుచుకుంటూ వెడుతుంటే - ఎవరో తెలిసిన వాళ్ళు చూసి బామ్మకి చెప్పారుట. బామ్మ గబగబా వెళ్ళి ఎక్కడికి వెడుతున్నావురా... అంటే... నన్ను తిట్టావుగా హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని చెప్పారుట.


కానీ మా నాన్నగారు అల్లరి ఎంత చేసినా "ఫుట్ బాల్ ప్లేయర్" అయ్యారు.

ఈ మెడల్స్ అన్నీ ఆయనవే. ఆయన 1938లో చాలా ఫుట్ బాల్ పోటీలలో పాల్గొని సాధించిన మెడల్స్. ఇన్నాళ్ళూ జాగర్త పెట్టిన వాళ్ళు మాకు అందచేశారు.




ఆయనకి ఆటలమీద, చిత్రలేఖనం మీద మంచి ఆసక్తి వుండేదిట. బొమ్మలు చాలా చక్కగా వేసేవారు. ఆయనకి ఏదో సాధించాలనే తపన చాలా ఎక్కువగా వుండేది.

అప్పట్లో ఏలూరులో ఆంధ్రాబ్యాంక్ కొత్తగా పెడితే మా బామ్మని మీ అబ్బాయిని పంపమని అడిగారుట. బామ్మ తీసికెళ్ళి చేర్పించింది. మూడుసార్లు పారిపోయి వచ్చారుట. వాళ్ళు మళ్ళీ పిలిచి తీసుకెళ్ళారుట. ఎందుకంటే వర్క్ విషయంలో చాలా నిజాయితీ గల మనిషి అవడం, నిమిషాల మీద కష్టమర్స్ పని పూర్తి చేయడం, పంపించడంతో ఆ ఉద్యోగం ఆయన్ని వదిలిపెట్టలేదు.


4 కామెంట్‌లు:

  1. బ్యాంకు ఉద్యోగికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం కష్టమర్ల పని త్వరగానూ, తప్పులు లేకుండానూ పూర్తి చెయ్యడం. అది మీ తండ్రి గారిలో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది 🙏.

    అయ్యో, ఫుట్-బాల్ ఆట కూడా కొనసాగిస్తే బాగుండేదేమో - బ్యాంక్ ఉద్యోగం చేస్తూనే?

    // “హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని చెప్పారుట”. // ఇది మాత్రం సూపర్ - ఆ వయసు కుర్రవాడికి 🙂.

    రిప్లయితొలగించండి
  2. మా బామ్మగారు ఆధునిక భావాలు ఉన్నప్పటికీ మరి ప్రోత్సాహం ఎంతవరకూ వుండేదో తెలియదు సర్. 21 సంవత్సరాల వయసులో 11 సంవత్సరాల మేనగోడలిని ఇచ్చి పెళ్ళిచేశారు. బహుశ సంసార బాధ్యతలు అడ్డం వచ్చి వుండచ్చు. నేను ఏడుగురు ఆడపిల్లలలో మధ్యలో దాన్ని. మా పెద్దవాళ్ళ విషయాలు పూర్తిగా తెలుసుకోలేకపోయానే అని అనిపిస్తోంది. అక్కడికీ బంధువులందరినీ వెతుకుతూ మూలాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీకు ధన్యవాదాలు సర్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏడుగురు ఆడపిల్లల మధ్యనా? అవునా! నాకైతే తొమ్మిదిమంది చెల్లెళ్ళు, ముగ్గురు తమ్ముళ్ళు. మొత్తం వీరందరికీ నేనే పెద్ద. ఒకప్పుడైతే మేమే కాక మా అమ్మానాన్పల వద్ద మా బామ్మ గారు కూడా ఉండేవారు. వెలసి పదహారుమందిమి కుటుంబంలో. ఆరోజులే వేరు లెండి.

      తొలగించండి
    2. అవునండీ నేను నాలుగో అమ్మాయిని. నిజంగానే ఆరోజులే వేరు. ఉన్నది సద్దుకోవడం తినడం. మేము మొత్తం పదిమందిమి ఉండేవాళ్ళం. టీవీలు, ఫోన్లు లేవు కాబట్టి కుటుంబ సంబంధాలు బావుండేవి. టెక్నాలజీ వచ్చేసి ప్రేమలు, అభిమానాలు తగ్గాయి. ఎవరింటికి వెళ్ళాలన్నా వాళ్ళ టీవీ టైములు అడిగి వెళ్ళాల్సి వస్తోంది. వర్క్ ఫ్రం హోంతో అసలు మాటల్లేవు.

      తొలగించండి