మలుపులు తిరుగుతున్న నా జీవితం - 20 హైదరాబాద్ నగరంలో ఎదురీత
నా జీవిత కదంబం. నా జీవితంలో జరిగిన వివిధ సంఘటనలు, వివిధ ప్రదేశాలకి నేను వెళ్ళిన స్థలాలలో అనుభూతుల, అనుభవాల, జ్ఞాపకాల సమాహారం.
6, జూన్ 2022, సోమవారం
మలుపులు తిరుగుతున్న నా జీవితం - 20 హైదరాబాద్ నగరంలో ఎదురీత - వాయిస్ ఆఫ్ సైలెన్స్
2, జూన్ 2022, గురువారం
మలుపులు తిరుగుతున్న నా జీవితం - 19 హైదరాబాద్ నగరంలో ఎదురీత
మలుపులు తిరుగుతున్న నా జీవితం - 19 హైదరాబాద్ నగరంలో ఎదురీత
31, మే 2022, మంగళవారం
మలుపులు తిరుగుతున్న నా జీవితం - 18 హైదరాబాద్ నగరంలో ఎదురీత
మలుపులు తిరుగుతున్న నా జీవితం - 18 హైదరాబాద్ నగరంలో ఎదురీత
** టైపిస్ట్ కమ్ ట్యూషన్ టీచర్***
29, మే 2022, ఆదివారం
మలుపులు తిరుగుతున్న నా జీవితం - 17 హైదరాబాద్ నగరంలో ఎదురీత
మలుపులు తిరుగుతున్న నా జీవితం - 17 హైదరాబాద్ నగరంలో ఎదురీత
27, మే 2022, శుక్రవారం
మలుపులు తిరుగుతున్న నా జీవితం - 16 హైదరాబాద్ నగరంలో ఎదురీత
మలుపులు తిరుగుతున్న నా జీవితం - 16 హైదరాబాద్ నగరంలో ఎదురీత
పజిల్ గా మారిన బస్సులో వెనక సీటాయన నవ్వు
24, మే 2022, మంగళవారం
మలుపులు తిరుగుతున్న నా జీవితం - 15 హైదరాబాద్ నగరంలో ఎదురీత
మలుపులు తిరుగుతున్న నా జీవితం - 15
హైదరాబాద్ నగరంలో ఎదురీత
ఇప్పటి నుంచీ అసలు కథ మొదలైంది. ఏదో ఒక స్థిరమైన ఉద్యోగం అయితే ఆ అనుభవాలు వేరే వుంటాయి. కానీ నాలాంటి వాళ్ళ అనుభవాలు వేరే వుంటాయి. ఒక్కోసారి వెనక్కి చూసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.
19, మే 2022, గురువారం
జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మలుపులు తిరుగుతున్న నా జీవితం - 14
జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35
మలుపులు తిరుగుతున్న నా జీవితం - 14
11, మే 2022, బుధవారం
జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మలుపులు తిరుగుతున్న నా జీవితం - 13
జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మలుపులు తిరుగుతున్న నా జీవితం - 13
అక్క వాళ్ళు హైదరాబాద్ రాగానే కొన్ని రోజులయ్యాక ఇప్పుడు ఉన్న రూము మా మేనత్త కూతురు వాళ్ళు చూపించారు.
ఒక పెద్ద కాంపౌండ్ మధ్యలో అంతా కుంకుడు, జామ, సపోట, చింత, సీతాఫలం వగైరా చెట్లన్నీ వుండేవి. చుట్టూరా రూములు. ఒక పక్క ఇల్లుగల వాళ్ళ పెద్ద పెంకుటిల్లు. రూములపైన బంగాళ పెంకులు. కానీ చుట్టూరా చెట్లు వుండడంతో చాలా చల్లగా వుండేది.
అందరూ ఉద్యోగాలు చేసుకునేవారు ఉండేవారు. ఒక రూములో మాత్రం ఒకతను వాళ్ల అమ్మతో వుండేవాడు. ఈ కాంపౌండ్ కి పెద్ద ఆకుపచ్చ రంగు గేటు వుండేది. అదొక రక్షణ కవచంలా వుండేది. దీనికి పప్పుకోట అని పేరు. అంతకు ముందు అక్కడొక పెద్ద మిల్లు వుండేదిట. ఈ గేటులోపల పప్పులు ఆరపెట్టేవారుట. గేటు దాటి బయటికి వెడితే చిన్న చిన్న ఇళ్ళు. ఆ ఏరియా పేరు మెహదీపట్నంలో ఉన్న గుడిమల్కాపూర్.
అక్క మర్నాడు బ్యాంక్ కి వెడుతూ "ఏమైనా పుస్తకాలు చదువుకో... బయట షాపులో ముసలామె వుంటుంది సాయంత్రం జొన్న రొట్టె చేసి ఇస్తుంది తీసుకో" అని చెప్పి వెళ్ళిపోయింది.
నేను అక్క ఆఫీసు నుంచీ వచ్చేలోపున షాపులో ఉన్న పెద్దామె దగ్గిరకి వెళ్ళి "అక్క జొన్నరొట్టె తీసుకోమంది" అన్నాను.
"అక్క కొలువుకు పోయినాది" అంది. నాకు అస్సలేమీ అర్థం కాలేదు. నేనేమీ మాట్లాకుండా చూస్తున్నాను.
"ఈ దినం చెయ్యనీకి రాలేదు బిడ్డా. రేపు చేసిస్తాను" అంది.
ఆ తెలంగాణ భాష వినడం అదే మొదలు కావడంతో కొంచెం కన్ఫ్యూజన్ తో "సరే" అని ఇంటికి వచ్చేశాను.
సాయంత్రం అక్క వచ్చాక చెప్పాను. "మెల్లిగా అర్థం అవుతుంది లే" అంది.
మర్నాడు పొద్దున్న తనతో బాటు ఆఫీసుకి రమ్మంది. ఇద్దరం కలిసి బస్ స్టాప్ కి వెళ్ళాం. అక్క ఎక్కాల్సిన డబుల్ డెక్కర్ నెంబర్ 5 బస్ వచ్చింది. అక్క పరుగు పెట్టుకుంటూ "తొందరగా రా" అంటూ ముందుకు వెళ్ళింది. నేను ఎక్కడ నిలబడ్డానో అక్కడే వుండిపోయాను. వెనక్కి తిరిగి చూసి "ఇక్కడే వున్నావా? ఇలా అయితే కష్టం. చూడు నీ మూలంగా బస్ మిస్ అయిపోయింది" అని విసుక్కుంది.
నాకు అంత మంది జనాన్ని చూస్తే ఇబ్బందిగా అనిపించింది. పరిగెత్తడానికి నామోషీగా అనిపించింది.
మొత్తానికి ఇంకో బస్ ఎక్కి అక్కావాళ్ళ ఆఫీసుకి వెళ్ళాం. అక్కడ నాకేం తోచలేదు. తను చాలా బిజీగా వుంది. వాళ్ళ ఆఫీసులో అటెండర్ ని ఇచ్చి దగ్గర వున్న లైబ్రరీకి పంపించింది. కానీ సిటీ కొత్త కావడంతో నేను మళ్ళీ అతనితోనే అక్క ఆఫీసుకి వచ్చేశాను.
ఇంతలోనే పెద్ద సౌండ్ వినిపించింది. కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే... విమానం పెద్ద సైజులో కనిపించింది. అప్పటి వరకూ ఊళ్ళలో చిన్న నక్షత్రంలా ఆకాశంలో చూడడమే కానీ... అంత దగ్గర నుంచి ఎప్పుడూ చూడలేదు. అప్పటికే నాలుగు సార్లు విమానాలు వచ్చాయి. చప్పుడయినప్పుడల్లా వెళ్ళి చూసేదాన్ని.
మధ్యాహ్నం లంచ్ టైములో తను రెగ్యులర్ గా టిఫిన్ చేసే హోటల్ కి తీసుకెళ్ళింది. హోటల్ లో పుస్తకాలు చదువుకుంటూ టిఫిన్ తినేదిట. అక్కడొక సర్వర్ అక్క దగ్గిర రెగ్యులర్ గా పుస్తకాలు తీసుకుని చదివేసి ఇస్తుండేవాడుట. నాకు తమాషాగా అనిపించింది. అతనికి నన్ను పరిచయం చేసింది. ఒక నవ్వునవ్వి. తన డ్యూటీ చేశాడు.
సాయంత్రం మళ్ళీ మెహదీ పట్నం వెళ్ళే బస్ ఎక్కి ఇంటికి చేరాం. అక్కకి వంట మీద పెద్ద ఆసక్తి వుండేది కాదు. తనకి తోచినది ఏదో చేసింది. ఇద్దరం తిన్నాం. ఈ దినచర్య ఇలా వుండేది.
నేను వచ్చింది ఉద్యోగానికి కాబట్టి అక్క ఒక ట్రాన్స్ పోర్ట్ ఆఫీసుకి తీసుకెళ్ళింది. ఆ ఆఫీసులో వాళ్ళు "ఎకౌంట్స్ రాయడంలో ట్రైనింగ్ ఇస్తాం. మొదటి పదిహేను రోజులూ జీతం ఇవ్వం" అన్నారు. అక్క ఆలోచించుకుని చెప్తాం అని వచ్చేసింది. ఆఫీసు మాత్రం చాలా పెద్దది.
అక్క "వాళ్ళు జీతం ఇవ్వకపోతే బస్ ఛార్జీలకి డబ్బులు కావాలిగా... మనకి కుదరదు లే" అంది.
సిటీ గురించి నాకు ఏమీ తెలియదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు.
తనకి తెలిసిన బాలకృష్ణ గారితో మా చెల్లెలికి ఉద్యోగం కావాలి అంది.
ఆయన మర్నాడు పొద్దున్న రమ్మన్నారు. అక్క, నేను బాలకృష్ణగారితో కలిసి యూసఫ్ గూడాలో ఉన్న ఆయన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం.
ఆయన పేరు ఎం.బి.ఆర్ రెడ్డి. ఇల్లు సినిమా సెట్టింగ్ లా వుంది. అక్కడే ఒక పెద్దాయన వున్నారు. ఆయన పేరు వెంకటరత్నం. ఆయన రెడ్డిగారి దగ్గర అకౌంటెంట్. అన్ని పరిచయాలు అయ్యాక రెడ్డిగారు "నేను అమ్మాయిని పటాన్ చెరు తీసుకుని వెడతాను. అక్కడ టైపిస్ట్ గా ఉద్యోగం ఇస్తాను" అన్నారు.
అప్పుడు నా పరిస్థితి గాలి ఎటు తోస్తే అటు వెళ్ళడంలా వుండేది. రెడ్డిగారు నల్లటి ఫియట్ కారులో నన్ను, వెంకటరత్నం గారిని పటాన్ చెరు ఆఫీసుకి తీసుకుని వెళ్ళారు.
5, ఏప్రిల్ 2022, మంగళవారం
జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మలుపులు తిరుగుతున్న నా జీవితం - 12
మెల్లగా కుదురుకుంటున్న మా జీవితాలు - మలుపులు తిరుగుతున్న నా జీవితం - 12
అక్క రెండో పాప రత్నని అమ్మ దగ్గిర దింపేసి విజయవాడ వచ్చేశాను. కానీ నా దృష్టంతా అమ్మ మీదే వుంది. మళ్ళీ స్కూల్లో చేరాను. నాకు ఆ స్కూల్లో చెయ్యాలనిపించలేదు.
ఇంతలోనే హైదరాబాద్ లో డెర్కో కూలింగ్ కోయిల్స్ అనే ప్రైవేట్ కంపెనీలో చేస్తున్న మా రెండో అక్క "నువ్వు హైదరాబాద్ వచ్చెయ్యి ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది" అని ఉత్తరం రాసింది. అప్పటి వరకూ ఏదో ఒకటి సాధించాలి అనే తపన అనేదే లేదు. ఎవరు ఎలా చెప్తే అలా చెయ్యడమే.
విజయవాడలో కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఎక్కాను. ట్రెయిన్ లో రిజర్వేషన్ చేయించుకోవాలనే ఐడియా లేదు. గబగబ ఎదురుగా వున్న కంపార్ట్ మెంట్ లో ఎక్కాను. సీటు కోసం చూస్తుంటే.... "నాగలక్ష్మీ" అని వినిపించింది. అదే మొదటిసారి హైదరాబాద్ వెళ్ళడం. ఎవరిదో తెలిసిన గొంతు వినిపించేసరికి ఆనందంగా అనిపించింది. తలతిప్పి చూశాను. నా చిన్నప్పటి స్కూల్ మేట్ నాగమణి. దగ్గిరకి వెళ్ళాను. తనకి సైడ్ సీట్ వచ్చింది. రా ఇక్కడ కూచో... నేను మా ఫ్రెండ్ హైదరాబాద్ వెడుతున్నాం. దిగేవరకూ మా దగ్గిరే కూచో అన్నారు. కొంచెం ధైర్యం అనిపించింది. ఇంటికి ఎలా వెడతావు అంది. "అక్క స్టేషన్ కి వస్తానంది" అన్నాను. ఫోన్లు లేవు. ఉత్తరం ద్వారా తెలిసిన విషయమే. మొత్తానికి ఏవో కబుర్లు చెప్పుకుంటూ హైదరాబాద్ చేరిపోయాం.
నేను స్టేషన్ లో దిగాను. నాకు అక్క ఎక్కడ కనిపించలేదు. చాలా భయంగా అనిపించింది. ఇంతలోకే ఒకాయన "ఎక్కడికి వెళ్ళాలమ్మా..." అన్నారు. "మా అక్క నారాయణగూడా స్టేట్ బ్యాంక్ లో చేస్తుంది" అన్నాను. "అయితే నేనూ అటే వెడతాను. స్టేషన్ బయట నెం.1 బస్ ఎక్కితే అటే వెడుతుంది. అక్కడ స్టాప్ వుంది. నేను ఎక్కేటప్పుడు నాతో ఎక్కమ్మా..." అన్నారు. చూడ్డానికి పెద్దమనిషి లాగే వున్నారు కదా అని ఆయనతో బాటు నెం.1 బస్ ఎక్కాను. నారాయణగూడాలో దిగాను.
బస్ స్టాప్ దగ్గరలోనే వున్న స్టేట్ బ్యాంక్ కి వెళ్ళాను. "రమాసుందరి కావాల"ని అడిగాను. అక్కడే ఉన్న ఒకాయన "నువ్వు స్టేషన్ నుంచి వస్తున్నావా... మీ అక్క స్టేషన్ కి వెళ్ళింది నీకోసం. సరే కూచో వస్తుంది" అన్నారు. ఒక అరగంటకి అక్క మొహం గాభరాగా పెట్టుకుని బ్యాంక్ కి వచ్చింది. ఎదురుగా వున్న నన్ను చూడగానే... "అలా ఎలా వచ్చేశావు. నేను నీకోసం స్టేషన్ అంతా తిరిగాను. సరేలే ముందు బాత్రూంకి వెళ్ళి మొహం కడుక్కుని ఫ్రెషప్ అయి రా... టీ తాగుదువుగాని" అంది.
నేను కాస్త రిలాక్స్ అయి రాగానే టీ తెప్పించింది. అది తాగి, నేను వచ్చేపోయే వాళ్ళని చూస్తూ కూచున్నాను. ఐదుగంటలకి బ్యాంక్ అవగానే మెహదీపట్నం లోపలకి ఉన్న గుడిమల్కాపూర్ లో తను ఉన్న రూంకి నన్ను తీసుకుని వెళ్ళింది. నాకు అంతా వింతగా, కొత్తగా ఉంది.

.jpg)













